చంద్రబాబు అరెస్ట్ కక్ష్య పూరిత చర్యే:లోకేష్
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ అయ్యి నేటికి 28 రోజులు అవుతుంది.కాగా చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నాయి. దీంతో ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గతకొన్ని రోజులుగా చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణపై ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా లోకేష్,భువనేశ్వరి,నారా బ్రాహ్మిణి ఇవాళ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు వారు చంద్రబాబుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో ములాఖత్ పూర్తైన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..కేవలం రాజకీయ కక్ష్యతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు తప్పు చేయరు. ప్రజల తరుపున పోరాడితే దొంగ కేసులు పెట్టారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని వ్యవస్థలను మేనేజ్ చేసి బాబును జైలుకు పంపారన్నారు.అయితే బాబు మాత్రం శాంతియుతంగా పోరాడాలని సూచించారని లోకేష్ తెలిపారు.ఈ కేసులో కాస్త ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ధైర్యంగానే ఉన్నారని లోకేష్ వెల్లడించారు.