Andhra PradeshHome Page Slider

రేపు మూడు ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు

Share with

ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వెళ్తారు. రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం మళ్లీ అమరావతి వస్తారు. రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్తారు. సాయంత్రం 4.41 గంటలకు చాంబర్ లో బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రిగా సచివాయంలోని మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు చేపడతారు. బాధ్యతల స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేస్తారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేస్తారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు పై రెండో సంతకం చేస్తారు. సామాజిక పింఛన్ రూ. 4000 వేలకు పెంచుతూ ఫైల్ పై మూడో సంతకం చేస్తారు. స్కిల్ సెన్సెన్స్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేస్తారు.