Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకు ఇంక బెయిల్ రాదు… మా పార్టీలో చేరండి

Share with

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇంక బెయిల్ రాదని, టీడీపీ కార్యకర్తలంతా తమ ప్రజాశాంతి పార్టీలో చేరండని పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. తాను చంద్రబాబుకు బెయిల్ రాదని ముందే ఊహించానన్నారు. టీడీపీ కార్యకర్తలు పవన్‌తో కలిసి పనిచేస్తే ఇంక అంతే సంగతులన్నారు. పవన్‌తో పోటీ చేసిన పార్టీలు ఓడిపోయాయని ఎద్దేవా చేశారు. అందుకే పవన్‌తో పొత్తులు వద్దని, తమ ప్రజాశాంతి పార్టీలో చేరాలని, వైజాగ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో టీడీపీ కేడర్‌ను కోరారు. తెలంగాణాలో కూడా తమ పార్టీ తరపున 119 స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని కేఏ పాల్ తెలియజేశారు. ఈ మాటలు విన్న టీడీపీ అభిమానులు పాల్‌కు మతి చలించిందని, ఇంకా ట్రీట్మెంట్లు జరుగుతున్నాయా అంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. బెస్ట్ కమేడియన్ అంటూ కితాబిస్తున్నారు.