Andhra PradeshHome Page Slider

చంద్రబాబు త్వరగా ప్రజల్లోకి రావాలంటూ హోమం

Share with

జగ్గంపేట గ్రామీణం: అక్రమంగా అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును త్వరగా విడుదల చేయాలంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు జగ్గంపేటలో హోమం నిర్వహించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని సుమారు నెల రోజులుగా జగ్గంపేటలో రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు. గురువారం ఉ.5 గంటల నుండి దీక్షా శిబిరం వద్ద 9 రోజులపాటు నవగ్రహ శాంతి హోమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.