అక్టోబర్ 19 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు ఈనెల 19 వరకు పొడిగించింది. మరో రెండు వారాల పాటు చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ న్యాయమూర్తి పొడిగించారు. మరోవైపు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం ఇరువర్గాల వాదనలు వింటామని న్యాయమూర్తి చెప్పారు.