కోర్టు విచారణకు వర్చువల్ గా హాజరుకానున్న బన్నీ
పాన్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు విచారణకు వర్చువల్ గా హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు నేరుగా వెళ్లాల్సి ఉండగా.. ఆన్ లైన్ ద్వారా హాజరవుతారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి అనుమతించడంతో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరుకానున్నారు. ఇదే కేసులో హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేడు విచారణకు హాజరుకానున్నారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలపనున్నారు.
Breaking news: మన్మోహన్‌తో టచ్‌లో ఉండేవాణ్ణి

