News

ఔను వాళ్లిద్దరు కలిశారు..

సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటికెళ్లిన మల్లారెడ్డి రేవంత్ ను కలిశారు. ఇంట్లోకి వెళ్లగానే.. ‘మల్లన్నా బాగున్నవా..?’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. తన మనవరాలు శ్రేయా రెడ్డి (మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె) వివాహానికి రావాల్సిందిగా శుభలేఖ అందించి ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని మల్లారెడ్డికి సీఎం హామీ ఇచ్చారు. రేవంత్ ను కలిసే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అక్కడే ఉన్నారు. రెండు రోజుల క్రీతం ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలిసిన విషయం తెలిసిందే. రాజకీయ వర్గాల్లో రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి భేటీపై చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మళ్లీ చాలా రోజులకు వీళ్లిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.