IPL 2025 ఓపెనింగ్ వేడుకలలో బాలీవుడ్ మెరుపులు..
ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 22న జరగబోయే ప్రారంభవేడుకలు కూడా ఘనంగా జరగబోతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ స్టార్స్ పాల్గొనబోతున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్ వంటి స్టార్ హీరోలు పాల్గొంటారని సమాచారం. అలాగే బాలీవుడ్ బ్యూటీలు శ్రద్ధాకపూర్, దిశాపటానీలతో హీరో వరుణ్ ధావన్ స్పెషల్ షో కూడా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.