బాబీడియోల్ పోర్షన్ END!
బాలకృష్ణ కెరీర్‌లో 109వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఓ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దానికి ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పుడు మరో అప్‌డేట్‌ను దర్శకుడు బాబీ రివీల్ చేశాడు. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతోంది. ఈ సినిమాలోని బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ముగిసినట్లుగా దర్శకుడు బాబీ ప్రకటించాడు. బాబీ డియోల్‌తో కలిసి ఉన్న ఫోటోను దర్శకుడు బాబీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిన్నారు.