సింగరేణి ఎన్నికలపై కమ్ముకుంటున్న నీలి నీడలు
తెలంగాణా రాష్ట్ర వ్యాఫ్తంగా త్వరలోనే ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నెలలో జరగాల్సిన సింగరేణి ఎన్నికలపై నీలి నీడలు కమ్ముకుంటున్నట్లు కన్పిస్తున్నాయి. కాగా సింగరేణి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. సింగరేణి కార్మికశాఖకు యాజమాన్యం సహాయ నిరాకరణ చేస్తుంది. ఈ మేరకు సింగరేణి ఎన్నికల నిలుపుదల కోసం యాజమాన్యం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపైనే సింగరేణి ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఎన్నికలపై విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగానే సింగరేణి ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. అయితే 2017లో జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం 9 డివిజన్లలో విజయం సాధించింది. అక్టోబర్ 6 నుంచి 9వరకు సింగరేణి ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగనుంది.అనంతరం అక్టోబర్ 10వ తేదిన ఎన్నికల చిహ్నాల కేటాయింపు జరుగుతుంది. కాగా అక్టోబర్ 28న ఎన్నికలు జరుగుతాయి.అయితే అదే రోజు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌ను ఏఐటియూసీ,బీఎమ్ఎస్ స్వాగతిస్తున్నాయి. మరోవైపు ఐఎన్టీయూసీ,హెచ్ఎమ్ఎస్,సీఐటీయూ ఎన్నికల వాయిదాకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికుల్లో వ్యతిరేకత రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.