Andhra PradeshHome Page Slider

పార్లమెంట్‌లో బీజేపీకి మా అవసరం ఎంతో ఉంది: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Share with

పార్లమెంట్లో TDPకి ఉన్నంత బలం తమకూ ఉందని YCP MP విజయసాయిరెడ్డి అన్నారు. ‘TDPకి 16 లోక్సభ సీట్లుంటే, తమకు రాజ్యసభలో 11, లోక్సభ 4 సీట్లు, మొత్తం 15 ఉన్నాయన్నారు. YCP రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్లో మా బలం తగ్గలేదన్నారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి BJPకి తమ అవసరం ఉందని గుర్తించాలన్నారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో NDA ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతిస్తామని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, జాతీయ మానవ హక్కుల సంఘం కు ఏపిలో జరుగుతున్న అకృత్యాలు, అరాచక పరిస్తితిని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారాయన. చంద్రబాబు పాలన ఆటవిక పాలనలా ఉందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వెనువెంటనే హింస చెలరేగడం రాబోయే 5 ఏళ్ళ చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో స్పష్టంచేస్తోందన్నారు. రాష్ట్రం కాదు, ఇది దేశమే తలవంచుకోవాల్సిన పరిస్థితన్నారు. టిడిపి గూండాలు స్వైరవిహారం చేస్తున్నారన్నారు. వారం, పదిరోజులుగా ఏపిలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలతో రాజ్యాంగమే కుప్పకూలి పోయిందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే హింసాత్మక సంఘటనలు, దాడులు జరగడం ఉద్దేశపూర్వకంగా జరిగినవేనన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హింసాత్మక దాడులు జరిగితే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందనే ఇలా ఉద్దేశపూర్వక దాడులు జరిగాయన్నారు. ఇదొక సాంప్రదాయంగా వచ్చే తరాలకు నేర్పించవద్దన్నారు. ఇదో రక్త చరిత్ర, చీకటి అధ్యాయమన్నారు. ఇలానే జరిగితే, ఎన్.డి.ఏ కూటమి లో భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీ కూడా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.