రేపో, మాపో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
అభ్యర్థుల ఎంపిక కు లైన్ క్లియర్
ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసిన బీఆర్ఎస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ఖరారు చేయగా, త్వరలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు.. కాంగ్రెస్, బీజేపీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికి అభ్యర్థుల వడపోత ప్రక్రియను మొదలుపెట్టిన బీజేపీ రేపో, మాపు 40 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సమస్యలతో సమతమతమవుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే అనేక వడపోతలు చేపట్టిన పార్టీ… అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే కీలక దశలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తి చేసిన పీసీసీ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర పార్టీ కోర్టులో వేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే అనుసరించాల్సిన వ్యూహాన్ని ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీలకు వివరించారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రాహుల్ గాంధీ ముఖ్యనేతలతో చర్చించారు. మొత్తంగా ఇప్పటికీ అభ్యర్థులు ఖరారుతో బీఆర్ఎస్ పార్టీలో ఊపు, ఉత్సాహం కనిపిస్తుంటే… రేపు, మాపో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల కావడంతో కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.