పోసానికి బెయిల్
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి భారీ ఊరట లభించింది. గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై అనుచితంగా మాట్లాడిన కేసులో ఓబులవారి పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతనికి బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టులో పోసానికి కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో పోసాని తరపున మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

