అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఆరు నెలల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సెప్టెంబర్ 5న తీర్పు కోసం రిజర్వ్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. “కొత్త సాక్షులు, నిందితుల పేర్లు ఉన్నందున, విచారణ సకాలంలో పూర్తయ్యే అవకాశం లేదు. బెయిల్ మంజూరు కోసం పిటిషన్ దారు షరతులను సంతృప్తిపరిచాడు” అని సుప్రీం కోర్టు తెలిపింది. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని అరవింద్ కేజ్రీవాల్‌ను ఆదేశించిన కోర్టు, మినహాయింపు ఇవ్వకపోతే ట్రయల్ కోర్టు ముందు జరిగే విచారణలకు హాజరు కావాలని కోరింది.