Andhra PradeshHome Page Slider

గర్భిణులకు విషాహారం సర్వ్ చేస్తున్న జగన్‌ను నమ్మాలా?

Share with

పాము కళేబరమున్న ఖర్జూరాన్ని గర్భిణులకు పంపిణీ చేయిస్తున్న సీఎం జగన్‌ను ప్రజలు ఎంతకాలం నమ్ముతారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు.

అమరావతి: పాము కళేబరమున్న ఖర్జూరాన్ని గర్భిణులకు పంపిణీ చేయిస్తున్న సీఎం జగన్‌ను ప్రజలు ఎంతకాలం నమ్ముతారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు పంపిణీ చేసిన ఎండుఖర్జూరం ప్యాకెట్‌లో చనిపోయిన పాము కళేబరం ఉండడంపై ఆయన ఆందోళన చెందారు. సైకో జగన్ ఇచ్చేది పౌష్టికాహారమా? విషాహారమా? అని బుధవారం ఓ ప్రకటనలో నిలదీశారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద ఇచ్చిన ఎండు ఖర్జూరం ప్యాకెట్‌లో కుళ్లిన పాము కళేబరము ఉన్న ఫొటోలు, వీడియోలను ఆయన తన ప్రకటనకు జతపర్చారు.