Home Page SliderNational

పూరీజగన్నాథ్ ఆలయంలో రత్నభాండాగారంలో విషసర్పాలున్నాయా?

పూరీ జగన్నాథ్ ఆలయంలోని రత్నభాండాగారాన్ని దాదాపు 46 ఏళ్ల తర్వాత తెరవనున్నారు. దీనితో ఈ గదిలో విషసర్పాలుంటాయా అనే భయం పట్టుకుంది. ఈ గదిలో ఏముందో అనే ఆసక్తితో దేశమంతా ఎదురుచూస్తోంది. ఒడిశాలో పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం తెరిచేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ గదిలో నాగుపాములు, కట్లపాములు ఉండొచ్చేమో అనే భయంతో ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని, వైద్యులను సిద్ధంగా ఉంచారు. కాగా ఈ గదిలో వేల కోట్ల విలువ చేసే రత్నాలు, మణులు, బంగారు నాణాలు ఉన్నాయన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.