ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విలువలున్నాయా?
మంత్రాలయం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు ఉన్నాయా..? అని మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ బాధ్యులు తిక్కారెడ్డి, కేఈ శ్యాంబాబు అన్నారు. ఆదివారం వారు మంత్రాలయంలో తెదేపా రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి అడివప్పగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబస్సప్ప, మంత్రాలయం మండల అధ్యక్షుడు పన్నాగ వెంకటేశ్ స్వామితో కలిసి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఏపీలో రాజ్యాంగం అమలవుతోందా, చట్టాలున్నాయా అనే సందేహం కలుగుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సుమారు 36 రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో పెట్టారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని డాక్టర్లు చెబుతున్నా, ఆసుపత్రికి ఎందుకు పంపించడం లేదన్నారు. ఆసుపత్రికి తరలించి ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా ఉమ్మడి కర్నూలు జిల్లా తెదేపా నాయకులు మంగళవారం కర్నూలులో శాంతియుతంగా ర్యాలీ తీయనున్నట్లు పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి పైశాచికానందం కోసం ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో పెట్టారన్నారు.