Home Page SliderTelangana

బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న మరో ఎమ్మెల్యే

Share with

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ గట్టి షాక్ తగిలేలా కన్పిస్తోంది. కాగా బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ..రేపు బీఆర్ఎస్ పార్టీ నుండి తన రాజీనామా ప్రకటన చేస్తానన్నారు. అయితే  రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని రేఖానాయక్ ప్రకటించారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ 115మంది అభ్యర్థులకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించి తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో రేఖానాయక్‌కు టికెట్ దక్కలేదు. మరోవైపు ఆమె భర్తకు కూడా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆమె బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఆమె బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్దమయ్యారని సమాచారం.