ప్రభుత్వ కార్యాలయాలకు ఆంధ్రా యూనివర్సిటీ భవనాలు?
విశాఖ: వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే కార్యాలయాల ఏర్పాటుకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని భవనాలను కేటాయిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్ట్ ఒకటో తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారభించిన ఎలిమెంట్ భవనం ఇవ్వనున్నారన్న ప్రచారం ఏయూలో జరుగుతోంది. దీన్ని ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ నిర్వహణకు నిర్మించారు. మహిళా సిబ్బంది ఉండేందుకు ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగం పక్కన ఉన్న విద్యాతరంగిణి విహార్ మహిళా వసతి గృహం కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.