పునఃప్రారంభమైన అమర్‌నాధ్ యాత్ర
గత వారం హిందువులకు పరమపవిత్రమైన అమర్నాధ్ గుహ సమీపంలో వరదలో 16 మంది మరణించిన తరువాత రెండు రోజుల పాటు నిలిపివేయబడిన అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది., సోమవారం 4,000 మంది యాత్రికులు, జమ్మూ నుండి దక్షిణ కాశ్మీర్‌లోని 3,880 మీటర్ల ఎత్తైన గుహ పుణ్యక్షేత్రం యొక్క బేస్ క్యాంపులకు బయలుదేరడంతో తిరిగి ప్రారంభమైందని, అధికారులు తెలిపారు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) భారీ భద్రత మధ్య 110 వాహనాల కాన్వాయ్‌లో భగవతి నగర్ యాత్రి నివాస్ నుండి 12వ బ్యాచ్‌లో మొత్తం 4,026 మంది యాత్రికులు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. వీరంతా మంగళవారం ఉదయానికల్లా గుహకు చేరతారని అధికారులు వెల్లడించారు. గుహకు చేరే మార్గం వరదల్లో దెబ్బతినడంతో సైన్యం తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని సిద్ధం చేసింది. ఇప్పటిదాకా 1.13 లక్షల మంది శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆగస్టు 11న యాత్ర ముగియనుంది శుక్రవారం (జూలై 8) గుహ మందిరం సమీపంలో వరదల కారణంగా కనీసం 16 మంది మరణించారు మరియు దాదాపు 37 మంది గాయపడ్డారు, 15,000 మంది సురక్షితంగా రక్షించబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యాత్రికులు మాత్రం గల్లంతయ్యారు. మిగతా వారందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. సోమవారం పహల్గాం బేస్ క్యాంప్ నుండి యాత్రను పునఃప్రారంభించామని, 14 కిలోమీటర్ల పొడవైన ఉత్తర కాశ్మీర్ ట్రెక్ మూడు చోట్ల దెబ్బతిన్నందున బల్తాల్ బేస్ క్యాంప్ నుండి యాత్రను తిరిగి ప్రారంభించలేదని అధికారులు తెలిపారు.
Read More:కొత్త పార్లమెంట్ భవనం అదుర్స్…