హాజీ అలీ దర్గాను Visit చేసిన అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ ఇటీవల ముంబైలోని హాజీ అలీ దర్గాను సందర్శించారు. దర్గాలో పునరుద్ధరణ పనుల కోసం నటుడు రూ.1.21 కోట్లు అందించారు. “హాజీ అలీ దర్గా పునరుద్ధరణ జరుగుతున్నప్పుడు దగ్గరుండి చూసిన పద్మశ్రీ అక్షయ్ కుమార్, నిజమైన ముంబైకర్, అత్యంత ఆప్యాయత, భక్తితో అత్యంత వేగంగా స్పందించారు. గురువారం, అతను ఉదారంగా రూ.1,21,00,000 పునరుద్ధరణ ఖర్చుల విభాగానికి అందజేశారు. హాజీ అలీ దర్గా ట్రస్ట్, మాహిమ్ దర్గా ట్రస్ట్- మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సుహైల్ ఖాండ్వానీ, అతని బృందంతో కలిసి ఆయనను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. మా దేశ శ్రేయస్సు కోసం అతనికి మా కృతజ్ఞతలు, శాంతి, సామరస్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను, ”అని హాజీ అలీ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహ్మద్ అహ్మద్ తాహెర్ ఒక ప్రకటనలో తెలిపారు.