అభిషేక్ సర్‌ప్రైజ్..షోలోనే బిగ్ బి కంటతడి
బిగ్ బి అమితాబ్ బచ్చన్ 80వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. పుట్టిన రోజు కూడా యధావిధిగా “కౌన్ బనేగా కరోడ్ పతి” ప్రోగ్రామ్‌కి వెళ్లిన అమితాబ్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చేలా అభిషేక్ ఏంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా బిగ్ బి ని కంటెస్టెంట్ సీట్‌లో కూర్చోబెట్టి పలు ప్రశ్నలు అడగ్గా..అమితాబ్ కంటతడి పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు టెలికాస్ట్ కానుండగా , దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఆయన సతీమణి జయ బచ్చన్ కూడా ప్రోగ్రామ్‌కు రాగా అక్కడే కేక్ కట్ చేశారు అమితాబ్. ఈ వారం షోలో కొంత సమయం సందడిగా మరికొంత సమయం బాధగా సాగినట్టు ప్రోమోలో చూడవచ్చు.

