Andhra PradeshHome Page Slider

జీఓ1ని తెచ్చింది ఏ1.. కొట్టేసింది హైకోర్టు: లోకేశ్

ఏపీలో జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1ను ఏపీ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. కాగా దీనిపై టీడీపీ జాటీయ ప్రధాన కార్యదర్శి నారా లోకష్ ట్విటర్ వేదికగా  స్పందించారు. ఏ1 తెచ్చిన జోవో1ని హైకోర్టు కొట్టి వేసిందన్నారు. దీంతో ఫ్యాక్షన్ పాలనపై ప్రజాస్వామ్యం గెలిచిందని లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం ఇక ఏమాత్రం చెల్లదని అంబేద్కర్ రాజ్యాంగం నిరూపించిదని లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా ఏపీలో రోడ్ షోలు,బహిరంగ సభలు నిర్వహణకు సంబంధించి జగన్ ప్రభుత్వం జీవో నెం.1ను తీసుకు వచ్చింది. అయితే ఈ జీవో నెం.1 ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తుందని అభిప్రాయ పడిన హైకోర్టు ఈ జోవో నెం.1ను కొట్టివేసింది. దీంతో ఏపీలోని ప్రతిపక్షాల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.