సైదాబాద్‌లో హైటెన్షన్ స్థంభం ఎక్కిన యువకుడు
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. శివశక్తి బార్ దగ్గరలో హైటెన్షన్ స్థంభాన్ని గుర్తు తెలియని యువకుడు ఎక్కి హంగామా చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఆ వ్యక్తిని విద్యుత్ స్థంభం నుంచి కిందకు దింపేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైటెన్షన్ స్థంభం ఎక్కిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు అతను ఎందుకు విద్యుత్ స్థంభం ఎక్కాల్సి వచ్చింది? అతని డిమాండ్స్ ఏమిటోతెలియాల్సిఉంది.