గోవర్థన పూజలో ఆవులతో వింత ఆచారం..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దీపావళి పండుగ అనంతరం గోవర్థన పూజను వైభవంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు గోవర్థన గిరిని ఎత్తిన సంఘటనకు గుర్తుగా ఈ పూజను నిర్వహిస్తారు. ఈ పూజలో ఆవులను పూజిస్తారు. దీనిలో భాగంగా ఉజ్జయిని జిల్లాలో బిదడ్వాడ్ గ్రామస్తులు కొందరు ఆవులతో తొక్కించుకున్నారు. ఇలా చేస్తే తమ కోరికలు ఫలిస్తాయని నమ్ముతున్నారు. ఆవులు తొక్కుతూ వెళ్లిన కాసేపటికి వారు లేచి నృత్యాలు చేస్తూ పండుగ చేసుకున్నారు. దీనితో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి స్టంట్లు ప్రమాదకరమని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.