Andhra PradeshHome Page Slider

బాణాసంచా కంపెనీలో భారీ పేలుడు

Share with

తమిళనాడులోని ఓ బాణాసంచా పరిశ్రమలో జరిగిన పేలుడు దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

తమిళనాడు (వేలచ్చేరి): తమిళనాడులోని ఓ బాణాసంచా పరిశ్రమలో జరిగిన పేలుడు దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. అరియలూరు జిల్లా వీరగాలూర్ గ్రామంలో రాజేంద్రన్ అనే వ్యక్తి బాణాసంచా పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. దీపావళి పండుగ సమీపిస్తుండంతో తయారీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సుమారు 35 మందికి పైగా కార్మికులు సోమవారం ఉదయం పనిలో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గోడౌన్‌లో ఉన్న టపాసులు పేలాయి. వెంటనే కొందరు కార్మికులు దూరంగా పరుగులు తీశారు. మంటలు పైకి ఎగిసిపడటంతో గ్రామస్థులు ఆ ప్రాంతం నుంచి దూరంగా పరిగెత్తారు. మిగిలిన కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.  ఘటనాస్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ ఆని మేరీ, ఎస్పీ అబ్దుల్లా సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను తంజావూర్ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మహిళలు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఓ వ్యాన్, 9 టూవీలర్ వాహనాలు, ఓ ట్రాక్టర్ మంటల్లో దగ్ధమయ్యాయి. రెండు గోడౌన్లు తునాతునకలయ్యాయి.