జపాన్‌ను వణికించిన భారీ భూకంపం..సునామీ భయం
జపాన్‌లోని దక్షిణ తీర ప్రాంతం క్యుషు ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. దీనితో ఆ ద్వీపం చిగురుటాకులా వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదయ్యిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. సునామీ కూడా సంభవించే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. క్యుషు ద్వీపానికి దగ్గరలో ఉన్న షికోకు ద్వీపానికి కూడా సునామీ ప్రమాదం ఉండొచ్చని ప్రజలను అప్రమత్తం చేశారు. అక్కడ భూకంపం కేంద్రం సమీపంలో విమానాశ్రయం పాక్షికంగా దెబ్బతిన్నదని స్థానిక మీడియా సమాచారం.