ప్రజల కోసం వచ్చిన ఉప ఎన్నిక
మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం, ఒక పదవి కోసం వచ్చినది కాదు.. ఇది ప్రజల కోసం వచ్చిన ఎన్నిక అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇది ఒక కుటుంబ పాలనను అంతమందించడానికి, అహంకార ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు, అవినీతి పాలనను, అరాచక పాలనను దించేందుకు వచ్చిన ఎన్నిక అని పేర్కొన్నారు. హుజూరాబాద్ లో బీజేపీని గెలిపించినప్పటికీ మోటార్లకు మీటర్లు రాలేదు కదా.. ఇప్పుడు బీజేపీ ని గెలిపిస్తే మీటర్లు వస్తాయని కేసీఆర్ భయపెట్టడం అబద్ధాలకు పరాకాష్ట అని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులను భయపెట్టి ఓట్లు దండుకోవడమే కేసీఆర్ పని అని విమర్శించారు.

