Andhra PradeshHome Page Slider

ఓ బావ, ఓ భార్య, ఓ భర్త… భలే రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఓ బావ, ఓ భార్య, ఓ భర్త రాజకీయంగా తయారయ్యాయి. మొన్నటి వరకూ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తన బావగారు చంద్రబాబుకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఆమె సుప్రీంకోర్టుపైనే కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రంలో తానేం మాట్లాడితే అది కరెక్టే అంటూ కితాబులిచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబు చెప్పిందే వేదం అన్నారు.

ఇప్పుడు ఆమె భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనకీ రాజకీయాలే వద్దంటూ హాట్ కామెంట్స్ చేశారు. బాపట్ల జిల్లా కారంచేడులో ఓఎన్జీసి నిధులతో ఏర్పాటు చేసిన శుద్దజలకేంద్రం ప్రాంరంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నికలలో పోటి చేసి డబ్బు పోగొట్టుకొలేదు కాబట్టి నేను చాలా అదృష్టవంతున్ని అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు.కోట్లు ఖర్చు పెట్టి చీరాల  ఎమ్మెల్యే గా కొండయ్య గెలిచారు.అయితే తీరప్రాంతంలో  ప్రమాదవశాత్తు పర్యాటకులు మృతి చెందుతున్నారని రిస్టార్డ్స్ ఓనర్స్ తో మీటింగ్ పెడితే డబ్బులు దోచుకున్నారని కొన్ని పత్రికలు ఆరోపణలు చేశాయన్నారు. తాను ఎంతో తృప్తిగా రాజకీయల నుండి రిటైర్మెంట్ అయ్యానని దగ్గుబాటి అన్నారు.

 తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 60 గ్రామాలకు నీటి వసతి కల్పించానని ఇప్పటికి ఆ గ్రామాలకు అదే పద్దతుల్లో నీరు సరఫరా జరుగుతున్నందుకు తృప్తిగా ఉందన్నారు.20 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలలో ఓడిపోయి మరలా పోటీ చేసి డబ్బు పోగొట్టుకోనందుకు తృప్తి గా ఉందన్నారు.సభల్లో ఇదే నా చివరి ఉపన్యాసం కావచ్చని..నా శేష జీవితం పుస్తకాలు రాస్తూ,పిల్లలతో గడుపుతూ తృప్తిగా జీవిస్తానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. అంటే ఈ ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేలు రూ.20 కోట్లు ఖర్చుపెట్టారని చెప్పకనే చెప్పినట్లయ్యింది.