వరల్డ్ కప్‌లో భారత్‌కు భారీ షాక్..ఆస్పత్రిలో చేరిన స్టార్ క్రికెటర్
ప్రపంచకప్ వేళ టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఆస్పత్రి పాలయ్యారు. కాగా శుభ్‌మన్ గతకొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు దూరమయ్యారు. అయితే శుభ్‌మన్ ఇప్పటికీ డెంగీ జ్వరం నుంచి కోలుకోలేదు. దీంతో ఆయనను చైన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా డెంగీ జ్వరం కారణంగా శుభ్‌మన్ గిల్ ప్లేట్ లెట్స్ సంఖ్య లక్ష కంటే తక్కువ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారని బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శుభ్‌మన్ గిల్ త్వరలో జరగబోయే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశం కన్పిస్తోంది. అయితే ఇది టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి.