Home Page SliderNational

‘కల్కి’లో అలరించనున్న నాటి అందాల నటి

Share with

‘కల్కి’ చిత్రంలో అతిథి పాత్రలో అలరించనుంది అలనాటి అందాల నటి శోభన. గతంలో టాప్ హీరోలందరితో దక్షిణ భారత భాషా చిత్రాలలో నటించిన ఈమె టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. 2006లో చివరిగా ‘గేమ్’ చిత్రంలో నటించిన ఈమె దాదాపు 18 ఏళ్ల తర్వాత తిరిగి సినిమాలో కనిపించబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వినూత్న దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ ఫిక్షన్ మూవీలో ఇప్పటికే దేశంలోని అగ్రతారలందరూ పాలు పంచుకున్నారు. అమితాబ్, కమల్ హసన్, దీపికా పడుకొనే, దిశా పఠానీ ముఖ్య పాత్రలలో నటిస్తుండగా తాజాగా శోభన కూడా ఈ చిత్రంలో భాగమయ్యింది.

సినిమాల అనంతరం సొంతంగా భరతనాట్యం కళాశాల పెట్టుకుని ఎంతోమంది ఔత్సాహిక కళాకారిణులకు గురువుగా నృత్యపాఠాలు చెప్పిన శోభన మళ్లీ ఇన్నేళ్లకు ఈ చిత్రంలో కనిపించబోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. కల్కి విడుదలకు ముందు సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చెప్పిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక్కో పాత్రను రిలీవ్ చేస్తూ అభిమానులలో ఆశ్చర్యం కలిగిస్తున్నారు. నేడు శోభన పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ‘ఆమె లాగానే ఆమె పూర్వికులు కూడా వేచి ఉన్నారు’ అనే కాప్షన్ ఇచ్చారు. కాగా కల్కి ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు ముంబాయిలో జరగనుంది. అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం కానుంది.