అగ్ని ప్రమాదంలో అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ బోట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అజయ్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. రెండు రోజులుగా పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ ఆపరేషన్ లుంబినీ పార్క్ ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు మేర వెతికిన ఉపయోగం లేకపోయింది. లుంబినీ పార్క్ వద్ద అదృశ్యమైన వ్యక్తి సంజీవయ్య పార్క్ భారీ జాతీయ పతాకం వద్ద అతని మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గణపతి, అజయ్ లు మరణించారు.

