Home Page SliderInternationalmovies

ఆస్కార్‌కి నామినేట్ అయిన భారతీయ సినిమాలు ఇవే..

భారత్ నుండి ఈ ఏడాది కూడా కొన్ని సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. వాటిలో దక్షిణాది నుండి సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం, పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ది గోట్ లైఫ్’ , ‘ఆడు జీవితం’, ‘సంతోష్’, ‘వీర సావర్కర్’, ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు షార్ట్ లిస్ట్ కాగా ఆస్కార్ ఫైనల్ ప్రక్రియ జనవరి 8 నుండి 12 వరకూ జరుగుతుంది. చివరికి జనవరి 17న నామినేషన్లు ప్రకటిస్తారు. అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ చిత్రం ఆస్కార్ ‌కు ఎంపికైనా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. ‘కంగువా’ చిత్రం నటన, మేకింగ్ పరంగా మంచి మార్కులు సంపాదించుకున్నా ప్రేక్షకుల అభిమానాన్ని, కలెక్షన్లను సంపాదించలేకపోయింది.