ముద్ర లోన్‌ను భారీగా పెంచిన కేంద్రం
కేంద్ర బడ్జెట్లో ఈసారి ముద్ర లోన్ పరిమితిని కేంద్రం భారీగా పెంచింది. ఇప్పటివరకు ముద్రలోన్ స్కీమ్ కింద కేంద్రం రూ.10 లక్షల వరకు లోన్ ఇచ్చింది. అయితే ఈసారి ముద్ర లోన్ పరమితిని పెంచుతూ ఈ స్కీమ్ కింద రూ.20 లక్షల వరకు లోన్ ఇస్తామని ప్రకటించింది. కాగా మన దేశంలోని వాణిజ్య బ్యాంకులు,చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఈ లోన్స్‌ను అందిస్తాయి.

