‘థాంక్యూ ఇండిగో’ అంటున్న బ్రిటన్ ప్రధాని రిషి
భారత ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద డీల్‌ను కుదుర్చుకున్న ఇండిగో సంస్థకు థాంక్యూ అంటూ కృతజ్ఞతలు చెప్పారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. ఇండిగో సంస్థ బ్రిటన్‌కు చెందిన ఎయిర్ బస్ నుండి 500 విమానాలను కొనుగోలు చేయడానికి కుదుర్చుకున్న ఈ డీల్ తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఆసరానిచ్చిందన్నారాయన. ఇది యునైటెడ్ కింగ్డమ్ ఏరోస్పేస్ సెక్టార్లో మేజర్ విన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ డీల్ ద్వారా యూకేలో ఎన్నో ఉద్యోగాలు వస్తాయని, ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రతిగా ఎయిర్ బస్ కూడా సునాక్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. ఇండిగో సంస్థ కూడా భారత మూలాలకు చెందిన బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలకు సంతోషం వ్యక్తం చేసింది. ప్రధాని రిషి సహకారంతో ఎయిర్ బస్తో తమ వ్యాపార భాగస్వామ్యం బాగా అభివృద్ధి చెందుతుందని ఆశించింది. ఈమేరకు తమ గురుగ్రామ్ హెడ్ క్వార్టర్స్ నుండి ట్వీట్ చేసింది.

