రికార్డు స్థాయిలో కొండగట్టు ఆదాయం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కొండగట్టు క్షేత్రం కాషాయమయమైంది. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా ఆలయానికి రికార్డు స్థాయిలో రూ. 1,74,18,905 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ. 24 లక్షల అదనపు ఆదాయం రావడం విశేషం.
ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి:
| విభాగం | ఆదాయం (రూపాయల్లో) |
| లడ్డూ ప్రసాదం | 99,79,525 /- |
| దీక్షా విరమణలు | 32,66,600 /- |
| శీఘ్ర దర్శనం | 17,94,200 /- |
| పులిహోర ప్రసాదం | 15,41,380 /- |
| కేశఖండన | 8,37,200 /- |
| మొత్తం ఆదాయం | 1,74,18,905 / |
వేల సంఖ్యలో భక్తులు హనుమాన్ దీక్షలను విరమించి, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ మరియు పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారానే దాదాపు కోటి రూపాయల వరకు ఆదాయం రావడం భక్తుల తాకిడికి నిదర్శనంగా నిలిచింది.

