హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం
హైడ్రా పోలీస్ స్టేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనుగోలు చేశారు. అనంతరం హైడ్రా సిబ్బంది కొత్త వాహనాలకు ఫ్లాగ్ ఆఫ్ చేసి సీఎం ప్రారంభించారు. 55 స్కార్పియోలు, 21 డీఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ వాహనాలు ఉన్నాయి. ట్రూప్ క్యారియర్ వ్యానులు మరియు కొన్ని బైకులకు ఫ్లాగ్ ఆఫ్ చేసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పలువురు నేతలు పాల్గొన్నారు.

