Home Page SliderNational

నీట్ పరీక్షలో లీకేజ్ కోసం రూ.30 లక్షలు

Share with

దేశంలో వైద్యవిద్య కోసం రాసే ప్రవేశ పరీక్ష నీట్-యూజీ ప్రవేశ పరీక్షలో లీకేజ్ సంచలనం రేపుతోంది. బీహార్‌లో ఈ ఆరోపణలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ 14 మందిని అరెస్టు చేయగా, వారిలో ఒక ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నాడు. ఈ విచారణలో భాగంగా కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు బయటపడింది. వారిని సొమ్ము చెల్లించిన అనంతరం సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నపత్రం చూపించాం అని ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించారు.  ఈ విషయంపై పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా స్పందించలేదు.