Home Page SliderNational

ఉత్తరాఖండ్ సొరంగం లోపల నుంచి 35 మంది బయటకు

35 మంది కార్మికులను బయటకు తీసి ఉత్తరాఖండ్ సొరంగం లోపల తాత్కాలిక ఆసుపత్రికి తరలించారు. అందరి ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు చెప్పారు. మిగతా కార్మికులను సొరంగం నుంచి కాసేపట్లో బయటకు తీసుకురానున్నారు. ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారాలోని సొరంగంలో భూగర్భంలో చిక్కుకున్న 35 మందిని రక్షించారు. 17 రోజులుగా చిక్కుకున్న కార్మికులను… మాన్యువల్ “రాట్-హోల్” మైనింగ్‌ పద్దతి ప్రకారం బయటకు తీసుకొస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత యంత్రాలు లేదా ఆగర్స్ తర్వాత ఉపయోగించిన సాంకేతికత సఫలం కాకపోవడంతో వారిని మాన్యువల్ గా బయటకు తెస్తున్నారు. ఒక్కో కార్మికుడిని వెలికి తీయడానికి ఐదు నుంచి ఏడు నిమిషాల సమయం పడుతుందని రెస్క్యూ అధికారులు తెలిపారు.